సీనియర్ ఐ ఏ యస్ టి కె రామా మణి స్వల్ప అస్వస్థతతో కన్నుమూశారు. ఒంట్లో నలతగా ఉందని ఆమె గురువారం సర్వ జన ఆసుపత్రికి వచ్చారు. వైద్యం అందిస్తుండగా రామామణి మృతి చెందారు. 56 ఏళ్ల ఆమె వాణిజ్య పన్నులశాఖలో కార్యదర్శిగా పనిచేశారు. అనంతపురం జాయింట్ కలెక్టరుగా పని చేసి విజయవాడకు బదిలీ అయ్యారు. గుంటూరు పండరిపురంలో ఆమె బంధువుల ఇంటికి గత రాత్రి వచ్చారు. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ హుటాహుటిన తరలివచ్చారు. రామమణి పార్ధీవదేహన్నీ ప్రవీణ్ ప్రకాష్ తో పాటు జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్,జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, ప్రశాంతి, ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డి. తహసీల్దార్ లు శ్రీకాంత్, తాత మోహన్ రావు, డి యస్ ఓ టి శివరామకృష్ణ తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. రమా మణి భర్త మురళీమోహన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.రామా మణి తండ్రి టి కె ఆర్ శర్మ స్వాతంత్ర్య సమరయోధులు. శాసనసభ్యులుగా వ్యవహరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జన్మించారు.
Breaking: ఏపీ సీనియర్ IAS అధికారిణి రామమణి మృతి
Related tags :