వాహన వినియోగదారులకు ఇది షాకింగ్ న్యూసే. వచ్చే నెలలో పెట్రో ధరలు లీటరుకు నాలుగైదు రూపాయలు పెరిగే అవకాశం ఉంది.
జూన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత పెట్రోలియం కంపెనీలు తిరిగి ధరలను రోజు వారీ సమీక్షించనున్నాయి.
ఈ నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.
లాక్‌డౌన్ తర్వాతి పరిస్థితిని సమీక్షించడానికి, రోజువారీ ఇంధన ధరల పెంపుపై కార్యాచరణ రూపొందించేందుకు గత వారం ఇంధన రిటైలర్లు సమావేశమైనట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లు తెలిపాయి.
ఒకవేళ లాక్‌డౌన్ ఐదో దశలోకి ప్రవేశించినా రోజువారీ ధరల సమీక్ష మాత్రం ప్రారంభమవుతుందని తెలుస్తోంది.