కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని చండీయాగం, సుదర్శన యాగాలను నిర్వహిస్తున్నారు. మర్కూక్ పంప్‌హౌస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, మర్కూక్ పంప్‌హౌజ్ వద్ద సుదర్శన యాగం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4:30 గంటలకు స్థానిక సర్పంచ్ రజిత రమేశ్, కొండపోచమ్మ దేవాలయ ఛైర్మన్ ఉపేందర్‌రెడ్డి ఈ యాగ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులు ఉదయం 7 గంటలకు కొండ పోచమ్మ దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి చండీయాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. ఉదయం 10 గంటల సమయంలో మర్కూర్ పంప్‌హౌస్ వద్ద నిర్వహించే సుదర్శనయాగం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీ పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు మర్కూక్ పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 11:35 గంటలకు కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో సీఎం పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు.
కొండపోచమ్మ రిజర్వాయిర్ వద్ద చండీయాగం ప్రారంభం
Related tags :