ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన కార్ల కంపెనీ కియా మోటార్స్ ప్రకటించింది. రాష్ట్రంలో అదనంగా మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూకున్ షిమ్ తెలిపారు ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమం సందర్భంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చేశారు. ఏపీతో కియా మోటార్స్ కు బలమైన బంధం ఉందని చెప్పారు.
ఏపీలో కియా మరిన్ని పెట్టుబడులు
Related tags :