స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్‌కు గురయ్యింది. టెక్నికల్ టీం సాయంతో గంటపాటు శ్రమించి మరలా ఆ అకౌంట్‌ను పునరుద్ధిరించారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్లో తెలిపారు. ‘హాయ్ ఆల్!! ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్‌కు గురయ్యిందని ఇప్పుడే నా టీం సమాచారమిచ్చింది. ప్రస్తుతం మేము దానిని పునరుద్ధరించే పనిలో ఉన్నాం. కాబట్టి నా అకౌంట్ నుంచి వ్యక్తిగతంగా ఎవరికైనా మెస్సేజ్‌లు వస్తే వాటిని నమ్మకండి. అలాగే మీ వ్యక్తిగత సమాచారం చెప్పమని అడిగితే మీరు చెప్పకండి. ధన్యవాదాలు’ అని పూజాహెగ్డే అర్ధరాత్రి 12.37 గంటలకు ట్విటర్ వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.కాగా, డిజిటల్ టీం సాయంతో తన అకౌంట్ పునరుద్ధరించారని పేర్కొంటూ అర్ధరాత్రి 1.05 గంటలకు మరోసారి ట్వీట్ చేశారు. ‘హ్యాక్‌కు గురైన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని పునరుద్ధరించడం కోసం గంటపాటు శ్రమించాం. ఇలాంటి సమయంలో ఎంతో కష్టపడి పనిచేసిన నా టెక్నికల్ టీంకు ధన్యవాదాలు. చివరికి నా అకౌంట్ నా చేతుల్లోకి వచ్చింది. గంట క్రితం నా అకౌంట్ నుంచి వచ్చిన పోస్టులను, మెస్సేజ్‌లను తొలగించాం’ అని పూజా వివరించారు.
హయ్యో…ఎంతపని జరిగింది పూజా!
.jpg)
Related tags :