DailyDose

ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక గోదావరిలోకి దూకిన యువతి-నేరవార్తలు

Telugu Crime News Roundup Today - Girl Commits Suicide In Godavari

* హైకోర్టుకు హాజరైన సీఎస్, పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి – పంచాయతీ భవనాలకు రంగుల విషయంలో కోర్టు ధిక్కరణ కేసులో హాజరైన సీఎస్ నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్

* టీటీడీ ఆస్తుల అమ్మకాలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. టీటీడీ ఆస్తులను వేలం వేయడం చట్టం విరుద్ధమని.. భవిష్యత్‌లో టీటీడీ ఆస్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని న్యాయవాది బాలాజీ కోరారు. టీటీడీ ఆస్తులను అధికార వైబ్ సైట్‌లో పెట్టాలని న్యాయవాది కోరారు. ఈ కేసుపై విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

* కర్నూలు జిల్లాలో గ్రామస్థులు, యువకులు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. కట్టెలు, రాళ్లతో చితక్కొట్టుకున్నారు. ఈ ఘటనలో పదిమంది గాయపడ్డారు. జిల్లాలోని చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో జరిగిందీ ఘటన.పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 150 మంది వలస కూలీలు మూడు వారాల క్రితం శ్రామిక్ స్పెషల్ రైలులో గ్రామానికి చేరుకున్నారు. వారందరికీ నిర్వహించిన పరీక్షల్లో 19 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందించారు.తాజాగా వారు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం వారందరినీ అధికారులు గ్రామానికి తరలించారు.

* ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యంతరకర, అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన 49 మందిలో ఏడుగురిపై సీఐడీ అధికారులు నిన్న కేసులు నమోదు చేశారు.

* ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు వేసిన అంశాన్ని ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. రంగులు తొలగించాలంటూ గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, వైసీపీ రంగులకు తోడు మట్టి రంగును ప్రభుత్వం కలిపింది. ఈ అంశంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ లను కోర్టుకు రమ్మని పిలిచింది. దీంతో, వీరిద్దరూ ఈరోజు హైకోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వం తరపు వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఓ కేసు విచారణకు సంబంధించి ఏపీ డీజీపీ కూడా ఇటీవల హైకోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే.

* ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ అమ్మాయి, అబ్బాయి చివరకు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. శ్రీరాంపూర్‌కు చెందిన మల్లిక, రామకృష్ణాపురానికి చెందిన సంతోష్‌ ఒకే జూనియర్ కాలేజీలో చదువుకున్నారు. వారిద్దరి మధ్య ఆ సమయంలో స్నేహం చిగురించింది.
ఆ తర్వాత వారిద్దరు ఇంటర్ పాసై డిగ్రీలో చేరారు. అక్కడ వారి స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయం వారిళ్లలో తెలిసిపోయింది. అయినప్పటికీ వారిని ఏమీ అనలేదు. అయితే, సంతోష్‌ కొన్ని నెలలుగా చదువు మానేసి ఇంట్లోనే ఉంటూ ఇతరులతో ఆన్ లైన్ గేమ్స్‌ ఆడుకుంటున్నాడు. గేమ్స్‌ కోసం అప్పులు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రియుడి మరణ వార్త విన్నప్పటి నుంచీ మల్లిక అతడి గురించే ఆలోచిస్తూ కూర్చుంది. ఆమె దిగాలుగా ఉంటుండడంతో పెద్దపల్లిలోని వారి బంధువుల ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆటోలో ఆమెను అక్కడికి తీసుకెళ్తుండగా, ఆ ఆటో ఇందారం గోదావరి బ్రిడ్జిపైకి చేరుకుంది. అంతే.. మల్లిక ఆటోలోంచి ఒక్కసారిగా గోదావరి నదిలో దూకేసి, మృతి చెందింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని బయటకు తీయించి కేసు నమోదు చేసుకున్నారు.

* విజయనగరం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ వై.బి భాస్కరరావు, అసిస్టెంట్ కమిషనర్ ఎస్.వి.ఎన్ బాబ్జిరావు ఆదేశాల మేరకు పార్వతీపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో A.E.S బి.శ్రీనాథుడు ఆధ్వర్యంలో పార్వతీపురం డివిజన్ పరిధిలో గల పార్వతీపురం మండలం జమాదల, లిడికి వలస వద్ద రూట్ వాచ్ చేస్తుండగా నటుసారను పట్టుకున్నరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పార్వతీపురం సి ఐ అబ్దుల్ కలీమ్ మట్లాడుతూ 3,200నాటుసారాపేకట్లు 40 లీటర్ల నాటుసారా2కెన్లు,4 బైక్లు,4 సెల్ ఫోన్ సీజ్ చేసారు 4వ్యక్తులను అదుపులోకి తీసుకున్నరు ఈ దాడులలో పార్వతిపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ నాగేశ్వరావు వారి సిబ్బంది పాల్గొన్నారు.

* పాతబస్తీలో జరిగిన గొడవకు వైసిపి పార్టీకి,కర్నూలుఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ఎలాంటి సంబంధం లేదని రెండు కుటుంబాల మధ్య ఉన్న వివాదానికి రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారని వైస్సార్సీపీ కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.వైస్సార్సీపీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు కుటుంబాల మధ్య పాతకక్షలే కారణమన్నారు.నిత్యం సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ టార్గెట్ చేస్తూ నీచ రాజకీయాలు చేస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు