ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంతో పేదరికంలోకి జారిపోయే చిన్నారుల సంఖ్య ఈ ఏడాది చివరినాటికి 8కోట్ల 60లక్షలకు చేరుకుంటుందని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. గతంతో పోలిస్తే ఇది ఒకేసారి 15శాతం పెరుగుతుందని తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా ప్రభావంతో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే చర్యలు తక్షణమే చేపట్టకపోతే.. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని దాదాపు 67.2కోట్ల మంది జాతీయ పేదరిక స్థాయికన్నా దిగువకు పడిపోతారని యునిసెఫ్ అంచనా వేసింది. ముఖ్యంగా ఐరోపా, మధ్య ఆసియా ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని తెలిపింది.
8కోట్ల మంది చిన్నారులకు ఆకలి తప్పదు
Related tags :