మనం తీసుకునే ఆహారంలో మొక్క జీవకణ భాగమే పీచు పదార్ధం. పీచుపదార్ధం కలిగిన ఆహారం వల్ల ఆరోగ్యపరంగా అనేక లాభాలున్నాయి. పీచుపదార్ధం కలిగిన ఆహారానికి నీటిని ఇముడ్చుకునే గుణం ఉంటుంది. దీనివల్ల ఆహారం పేగులలో సులభంగా కదిలే వీలును కలిగిస్తుంది. పెద్ద ప్రేగులలో జీర్ణమైన తరువాత మిగిలిపోయన వ్యర్ధ పదార్ధాన్ని బయటకి పంపడానికి ఈ పీచు దోహదపడుతుంది. ఒక హైపో కోలెస్టర్ లిమిక్ ఏజెంట్ గా పనిచేస్తూ పిత్తరస లవణాన్ని (బైల్ సాల్ట్) బంధించి కొలెస్ట్రాల్ తగ్గుదలను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులలోఆహార నియమాలను, నిర్వహణను పాటిస్తూ వుండడంలో సహాయపడుతుంది. ఇతర తృణ ధాన్యాలకంటే బియ్యంలో పీచు పదార్ధాలు చాలా తక్కువ శాతంలో ఉంటాయి.
ఎక్కువ పీచు పదార్థం కలిగిన ధాన్యాలు
జొన్నలలో 89.2 శాతం
సజ్జలలో 122.3 శాతం
రాగులలో 113.5 శాతం