పొట్టలో కాస్త తేడాగా ఉండి ఇబ్బందిపడుతుంటే… మజ్జిగలో కాసిన్ని మెంతులు వేసుకుని వెంటనే తాగేయమంటారు పెద్దవాళ్లు. ఇది మాత్రమే కాదు మెంతుల వల్ల ఇలాంటి ప్రయోజనాలెన్నో..
నెలసరి సమయంలో కొందరు కడుపునొప్పితో ఇబ్బంది పడుతుంటారు.
అలాంటప్పుడు గోరువెచ్చని నీటిలో మెంతులు వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.
* రీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఎంతగానో తోడ్పడతాయి. నేరుగా మెంతులను నోట్లో వేసుకుని నీళ్లు తాగవచ్ఛు లేదా రాత్రిపూట గ్లాసు నీటిలో చెంచా మెంతులు నానబెట్టి ఉదయాన్నే తాగినా ఫలితం ఉంటుంది.
* జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చని నీళ్లలో మెంతులు వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.
* బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడతాయి.
* మధుమేహాన్ని నియంత్రిస్తాయి. మలబద్ధకం లేకుండా చేస్తాయి.
* కీళ్ల నొప్పులను తగ్గించడానికి సాయపడతాయి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
* కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.