కరోనా వైరస్ కాలంలో రాష్ట్రాలకు, ప్రజలకు ఆర్థికంగా సహాయం చేసేందుకు.. కేంద్రం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోన్న విషయం తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా బ్యాకింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దేశంలోని ప్రతీ గ్రామానికి బ్యాకింగ్ సదుపాయాలు కల్పించే ‘సఖి పథకాన్ని’ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో ప్రభుత్వం ప్రధానంగా మహిళలకు ఉద్యోగాలు ఇస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్ ఉత్తర ప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకూ విస్తరించే అవకావం ఉంది.
సఖి పథకం మొక్క ముఖ్య ప్రయోజనాలు:
– ‘బిసి సఖి యోజన లేదా బ్యాకింగ్ కరస్పాండెంట్’ అనే పథకాన్ని ప్రారంభించింది కేంద్రం. ఈ పథకం ముఖ్య థ్యేయం గ్రామంలోని ప్రతీ ఇంటికీ బ్యాకింగ్ సేవలను తీసుకెళ్లడం.
– మొదటి దశలో దాదాపు 58 వేల మంది మహిళలకు ఈ పథకం కింద ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
– ఈ పథకం కింద పనిచేసే మహిళలందరూ ఇంటింటికి వెళ్లి అక్కడ ప్రభుత్వం నడుపుతున్న పథకాలు, బ్యాకింగ్ సౌకర్యాల గురించి వివరిస్తారు. ఇది మాత్రమే కాదు గ్రామస్తుల బ్యాంకులకి సంబంధించిన ముఖ్యమైన పనులు కూడా వీరే చేయాల్సి ఉంటుంది.
– సఖి పథకం కింద పని చేసే ప్రతీ మహిళకు కేంద్రం నెలకు రూ. 4000 ఇస్తారు. ఇది కాకుండా, లావాదేవీలు చేయడానికి బ్యాంకులు కూడా కమీషన్ ఇవ్వబడతాయి. దీనితో ఇంటి వద్ద ఉంటూనే మహిళలు ప్రతీ నెలా స్థిర ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.