తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. యావత్ దేశమే అబ్బురపడే వార్త ఒకటి చెప్పబోతున్నానని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ పట్టుబడితే మొండిపట్టు పడుతాడు. రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు రాబోతున్నాయి. తక్కువ కాలంలోనే ఆశించిన ప్రగతిని సాధించామన్నారు. ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. నియంత్రిత సాగు మాత్రమే.. నియంతృత్వ సాగు కాదు అని స్పష్టం చేశారు. నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే వేలాది గ్రామాలు తీర్మానం చేశాయి. ముఖ్యమంత్రి బాటే.. మా బాట అని రైతులు తీర్మానాలు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. దేశానికి మనం ఆదర్శం కావాలి. 530 టీఎంసీల నీళ్లను వాడుకోగలిగే సామర్థ్యాన్ని తెలంగాణ సంతరించుకుంది. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో తెలంగాణ అద్భుతమైన రాజనీతిని ప్రదర్శించి.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని సీఎం తెలిపారు.
తెలంగాణాలో నియంత్రిత సాగే తప్ప నియంతృత్వ సాగు లేదు
Related tags :