ScienceAndTech

ఇండియాలో 11అంకెల ఫోన్ నెంబర్లు

11 Digit Phone Numbers In India

ఇకపై దేశంలో 11 అంకెలతో కూడిన మొబైల్​ నంబర్లు 

మొబైల్‌ నంబర్ల విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) కీలక ప్రతిపాదనలు చేసింది.

దేశంలో 11 అంకెల మొబైల్‌ నంబర్‌ను వినియోగించాలని ప్రతిపాదించింది.

పలువురితో చర్చల అనంతరం కొన్ని సిఫార్సులను శుక్రవారం విడుదల చేసింది.

దేశంలో ప్రస్తుతం 10 అంకెల మొబైల్‌ నంబర్లు ఉన్నాయి. ఇకపై 11 అంకెల మొబైల్‌ నంబర్లను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా కొత్తగా నంబర్ల సంఖ్యను పెంచుకోవచ్చని ట్రాయ్‌ పేర్కొంది.

మొబైల్‌ నంబర్లకు ముందు 9 అంకెను కలపడం ద్వారా అవి 11 అవుతాయి.

ఫలితంగా టెలికాం ఆపరేటర్లు కొత్తగా మరో 1000 కోట్ల మొబైల్‌ నంబర్లను వాడుకలోకి తీసుకురావచ్చని ట్రాయ్‌ పేర్కొంది.

ఇకపై ల్యాండ్‌లైన్ల నుంచి మొబైల్స్‌కు కాల్‌ చేస్తే వాటి నంబర్ల ముందు సున్నా (0) కలపాలని ట్రాయ్‌ పేర్కొంది.

అయితే, ల్యాండ్‌లైన్‌ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్‌ నుంచి ల్యాండ్‌ లైన్‌కు, మొబైల్‌ నుంచి మొబైల్‌కు కాల్స్‌ చేస్తే సున్నా అవసరం లేదని తెలిపింది.

ప్రస్తుతం డాంగిల్స్‌కు పదెంకల నంబర్లే ఉన్నాయి. ఇకపై వాటిని 13 అంకెలకు పెంచాలని ట్రాయ్‌ సిఫార్సు చేసింది.