నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలని నిన్న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని వైకాపా ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కేవియట్ పిటిషన్ వేశారు. గుంటూరుకు చెందిన కాంగ్రెస్ నేత మస్తాన్‌వలీ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
నిమ్మగడ్డకు కాంగ్రెస్ బాసట
Related tags :