Movies

మేము పోటీదార్లు కాదు

Madhuri Dixit Speaks Of Her Friendship With Sridevi

తనకు, శ్రీదేవికి మధ్య ఏనాడూ పోటీలేదని బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ పేర్కొన్నారు. వీరిద్దరూ ఒకప్పుడు కథానాయికలుగా బాలీవుడ్‌ను ఏలారు. అనేక హిట్లు అందుకోవడంతోపాటు కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో శ్రీదేవి, మాధురీకి మధ్య పోటీ ఉందని చెప్పుకొనేవాళ్లు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధురీని ఇదే ప్రశ్న అడగగా ఆమె స్పందించారు. ‘శ్రీదేవికి వృత్తిపట్ల అంకితభావం చాలా ఎక్కువ. ఆమె తన మొత్తం జీవితాన్ని నటనకే అంకితం చేశారు. ఆమె చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయలేదు. మా మధ్య ఎటువంటి పోటీ లేదు. మేం రేసు గుర్రాలం కాదు, కాబట్టి ఎవరు ముందు ఉన్నారనే విషయం గురించి ఆలోచించకండి’ అని పేర్కొన్నారు.