న్యూయార్క్ నగరం మళ్లీ తెరుచుకోనున్నది. జూన్ 8వ తేదీ నుంచి సిటీని దశలవారీగా ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో ఎక్కవ శాతం కరోనా వైరస్ మరణాలు సంభవించింది ఈ నగరంలోనే. దశల వారీగా న్యూయార్క్‌లో సడలింపులు ఉంటాయని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కూమో తెలిపారు. సుమారు 4 లక్షల మంది ఉద్యోగులు మళ్లీ తమ విధుల్లోకి హాజరుకానున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60 లక్షలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 6033814గా ఉన్నట్లు వరల్డోమీటర్ పేర్కొన్నది. వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 3,66,890 మంది మరణించారు. సుమారు 26,61,145 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక జాన్ హాప్కిన్స్ సెంటర్ ప్రకారం వైరస్ పాజిటివ్ కేసుల లెక్క 59,27,255గా ఉన్నది. ఇప్పటివరకు అమెరికాలో 104166 మంది చనిపోగా 17లక్షలకు పైగా కరోనా పాజిటివ్ బాధితులు లెక్క తేలారు.
తెరుచుకోనున్న న్యూయార్క్ నగరం
Related tags :