Sports

ద్రవిడ్‌కు పాకిస్థానీ క్రికెటర్ ప్రశంస

Rahul Dravid Gets Praised By Pakistani Cricketer

టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ క్రికెట్‌ కోసమే పుట్టాడని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు రషీద్‌ లతీఫ్‌ అన్నాడు. అండర్‌-19, భారత్‌-ఏ జట్లను తీర్చిదిద్దాడని వెల్లడించాడు. తన సహచరుడు యూనిస్‌ ఖాన్‌ ఎదుగుదలకు అతడెంతో సహాయం చేశాడని పేర్కొన్నాడు. ‘ద్రవిడ్‌ అద్భుతమైన వ్యక్తి. అతడి సూచనలు, మార్గదర్శకత్వం తనలోని అత్యుత్తమ ఆటతీరును ఎలా బయటపెట్టాయో యూనిస్‌ ఖాన్‌ సైతం చెప్పాడు. రాహుల్‌ది గొప్ప క్రికెట్‌ బుర్ర. క్రికెట్‌ ఆడేందుకే పుట్టాడు. అవును.. క్రికెట్‌ ఆడేందుకే పుట్టాడు. భారత్‌-ఏ, అండర్‌-19 జట్లను అభివృద్ధి చేశాడు. అందుకే అతడు క్రికెట్‌ కోసమే పుట్టాడని చెప్పొచ్చు’ అని లతీఫ్‌ అన్నాడు.