DailyDose

నందిగామలో అపార్ట్‌మెంట్లు కొనవద్దు-నేరవార్తలు

Telugu Crime News Roundup Today - Illegal Aparments In Nandigama

* కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయితీ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగంలో పలు అవకతవకలు ఆరోపణలలో భాగంగా ముమ్మరంగా రికార్డులను పరిశీలిస్తున్న సిఅర్.డిఏ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్ మెంట్ నిర్మాణానికి నోటిసులు జారీ చేశారు అని సమాచారం. అనుమతి లేని వాటిని కూల్చివేతకు సర్వం రంగం సిద్ధం అని తెలుస్తుంది.ప్రభుత్వం ఆదాయానికి భారీగా గండి కోట్టి కోట్ల రూపాయలు దొచుకునే కంత్రి బిల్డర్స్ కు ఇంకా కష్టం కాలమే. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్ మెంట్ కోనుగోలు ప్రజలు చేయవద్దని అధికారులు తెలిపారు.

* తిరుపతి కోటకొమ్మాల వీధిలో శనివారం విషాదం నెలకొంది. సిమెంటు పెళ్లలు పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం….భవన నిర్మాణ పనుల్లో భాగంగా కోటకొమ్మాల వీధిలో ఓ భవనం శిథిలాలను తొలగిస్తున్నారు. ఆ భవనానికి ఎదురుగా ఉన్న ఇంట్లే ఉండే భరత్‌ (14) ఆ సమయంలో వీధిలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో సెమెంటు పెళ్లలు బాలుడి మీద పడి కుప్పకూలాడు. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు భరత్‌ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. తిరుపతి నగర పాలక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

* యువతులను మోసం చేసి వారి నుంచి డబ్బు గుంజేందుకు ఓ ఘరానా మోసగాడు బాలీవుడ్ చిత్రం ‘కబీర్‌ సింగ్’‌లో వైద్యుడి పాత్రను అనుకరించాడు. ఈ చిత్రం టాలీవుడ్‌ ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ వ్యక్తి తనకు తాను కీళ్ల వైద్య నిపుణుడిగా పేర్కొంటూ అమ్మాయిలను ఆకర్షించేవాడు. వారిని వివాహం చేసుకుంటానని.. వ్యక్తిగత చిత్రాలను, వీడియోలను పంపమని అడిగేవాడు. అనంతరం తన తల్లి వైద్యానికి అవసరమంటూ వారి నుంచి డబ్బు రాబట్టేవాడు. ఆ వ్యక్తి చేతిలో మోసపోయిన ఓ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

* మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కారు డ్రైవర్‌ నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా పరవాడ మండలం కలపాకలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

* కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురనే జ్ఞానం కూడా లేకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన తాండూరు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. తాండూరు గ్రామీణ ఎస్‌ఐ సంతోష్‌ శుక్రవారం చెప్పిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాలిక (13) తల్లి పదేళ్ల క్రితమే మృతి చెందింది. అనంతరం తండ్రి (37) మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో కూతురును దోమ మండలంలోని ఓ ప్రార్థనా పాఠశాలలో ఉంచి చదివిస్తున్నాడు. మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా కూతురు ఇంటికి చేరుకుంది. కామాంధుడై కూతురిపై కన్నేసిన అతను పవిత్ర రంజాన్‌ రోజునే ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కూతురు సవతి తల్లితోపాటు ఎవరితోనూ చెప్పులేక లోలోన కుమిలిపోయింది. రెండు రోజుల క్రితం కూతురిని హైదరాబాద్‌లోని పెద్దమ్మ ఇంటికి పంపించాడు. దీంతో తండ్రి చేసిన అఘాయిత్యాన్ని పెద్దమ్మకు వివరించింది. ఆమె వెంటనే గ్రామానికి చేరుకుని విషయాన్ని బాలిక నానమ్మకు వివరించింది. జరిగిన ఉదంతంపై తండ్రిని నిలదీశారు. అనంతరం బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.