మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌ని మీ అభిరుచికి తగినట్టుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం జీమెయిల్ త్వరలో కొత్తఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. జీమెయిల్ వినియోగదారులు ఇన్‌బాక్స్‌లో తమకు నచ్చిన లేఅవుట్‌ను ఎంచుకోవడం కోసం ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. జీమెయిల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఇంటర్‌ఫేసేస్, ఇన్‌బాక్స్ టైప్స్, డిస్‌ప్లే ఆప్షన్స్‌ను ఎంచుకోవడం ద్వారా నచ్చినట్టుగా ఇన్‌బాక్స్ లుక్‌ను మార్చుకోవచ్చు. మీరు ఒక సారి థీమ్ సెలక్ట్ చేసుకుని ప్రివ్వూ చూసి కన్‌ఫార్మ్ అంటే ఇన్‌బాక్స్ అప్‌డేట్ అవుతుంది. మల్టిపుల్ థీమ్స్‌ను ఎంచుకుని ఇన్‌బాక్స్‌ను పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించేలా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా గతంలో ఎంపిక చేసుకుని ఉన్న సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పు జరగదు. ‘సీ ఆల్ సెట్టింగ్స్’ క్లిక్ చేయడం ద్వారా ఫుల్ సెట్టింగ్స్ మెనూను చూడొచ్చు. జీసూట్ వినియోగదారులతో పాటు సాధారణ జీమెయిల్ వినియోగదారులకు ఈ ఆప్షన్ అందుబాటులోకి రానుంది.
మీ Gmail మీ ఇష్టం
Related tags :