చత్రపతి శివాజీ గుర్రం పేరేమిటో !
————————————————-
గుర్రాలలో పంచకళ్యాణి గుర్రం శ్రేష్టమైనది. పంచకల్యాణి హయానికి ఉండవలసిన లక్షణాలేమిటో తెలుసుకొందాం.
(1) నాలుగు కాళ్ళు తెలుపు రంగులో ఉండాలి.
(2) ముఖం పై తెల్లటి బొట్టు ఉండాలి.
(3) తెల్లటి కుచ్చుతోక కలిగి ఉండాలి.
(4) వీపు మొత్తం తెలుపు రంగులో ఉండాలి..
(5) మెడపై ఉండే జూలు కూడా పూర్తిగా శ్వేత వర్ణంలోనే ఉండాలి.
అశ్వాలను గురించి తెలియచేసే శాస్త్రం అశ్వశాస్త్రం. నకులసహదేవులు తురగ శాస్త్ర ప్రవీణులు.
విజయనగర ప్రభువులు, బహుమనీ సుల్తానులు అరబ్బు గుర్రాలపైనే ఆధారపడి తమ అశ్వదళాలను బలోపేతం చేసుకొన్నారు.
విజయనగర విరుపాక్ష రాయలు అనే రాజు గోవాలో అరబ్బులు గుర్రాలను తనకు అమ్మలేదని, బహుమని వారికి అమ్ముతున్నారని కోపించి అరబ్ వ్యాపారులందరిని ఊచకోత కోయించాడు.
పవన్, బాదల్,సారంగి అనే గుర్రాలపై జాన్సిలక్ష్మీ బాయి స్వారి చేసింది.
చేతక్ స్కూటర్లు తెలుసు కదా ! వాటికా పేరు చేతక్ అనే విశ్వాసపాత్రమైన గుర్రం వలన వచ్చింది. రాణా ప్రతాపసింగ్ గుర్రం పేరు చేతక్.రాణా ప్రాణాలను కాపాడిన గుర్రం చేతక్.
శివాజీ గుర్రం పేరు విశ్వాస్ అని పిలువబడిన పంచ కళ్యాణి. అక్బరు గుర్రం పేరు రాహ్ బర్ అంటే నమ్మకస్తుడని అర్థం. అలెగ్జాండర్ గుర్రం పేరు బుచేపోలస్.