DailyDose

సచివాలయ ఉద్యోగికి కరోనా.మంగళగిరిలో హైఅలర్ట్-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin - Andhra Secretariat Employee Tests Positive For Corona

* మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్న అధికారులు. మంగళగిరి నవులూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న సచివాలయం ఉద్యోగి పాజిటివ్ కేసు. పట్టణ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులపై మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఆరా.

* AP సచివాలయం ఉద్యోగుల ముగ్గురికి పాజిటివ్ కేసులు నమోదు. AP లో 24 గంటల్లో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. Ap లో మొత్తం 2944 చేరిన కరోనా కేసులు.

* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 7,964 కరోనా కేసులు నమోదు..265మంది మృతి, దేశవ్యాప్తంగా 1,73,763కి చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటి వరకు 4,971 మంది మృతి..యాక్టివ్ కేసులు 86,422..కోలుకున్న వారు 82,370

* ఏపీ సచివాలయంలో కరోనా కలకలం .హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ .గత రెండ్రోజులుగా అతనితో కలిసి తిరిగిన వారంతా, సికింద్రాబాద్ బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని విజ్ఞప్తి చేసిన అధికారులు.

* లాక్‌డౌన్‌ వెసులుబాటులో భాగ్యనగర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ కుమార్ అన్నారు. కరోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. లాక్‌డౌన్ సడలింపులతో న‌గ‌రంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోందని, గ‌త 15 రోజుల నుంచి న‌గ‌ర వ్యాప్తంగా ర‌ద్దీ పెరగడం.. జాగ్రత్తలు పాటించ‌క‌పోవ‌డంతో కేసుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, వ్యాపార‌స్తులు మిన‌హా మిగిలిన కుటుంబ స‌భ్యులు రోడ్లపైకి రాకూడ‌దని సూచించారు.

* బిహార్‌ రాష్ట్రంలో కొత్తగా మరో 150 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బారినపడ్డవారి సంఖ్య 3509కి చేరింది.

* తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ లేదని డైరక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డా. శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని.. సడలింపుల అనంతరం కేసులు పెరుగుతున్నాయని వివరించారు. లాక్‌డౌన్‌ సమయంలో కొందరు వ్యక్తుల వల్ల అనేక కుటుంబాలు వైరస్‌బారిన పడ్డాయని చెప్పారు. నాల్గో విడత లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి రాష్ట్రంలో కొత్తగా 1005 కేసులు వచ్చాయని.. వీటిలో 470 కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కొన్ని ప్రాంతాల్లో గత 15 రోజులుగా కేసులు పెరిగాయని తెలిపారు. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా తెలంగాణకు వస్తున్న వారిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బయటకి వెళ్తే మాస్కు ధరించడం.. భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు.

* కరోనా వైరస్‌ బారిన పడిన వాళ్లలో అత్యధికమంది కోలుకుంటున్నారని, వారిలోనూ హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు ఎక్కువగా ఉన్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌ అన్నారు. ఈ విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మొత్తం కరోనా బాధితుల్లో కేవలం 2100మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు వారి ఇళ్లలోనే చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. కరోనా బాధితుల కోసం ఇంకా 6500 బెడ్‌లు సిద్ధంగా ఉన్నాయని, మరో వారంలో వీటి సంఖ్యను 9500 పెంచుతామని పేర్కొన్నారు.