Devotional

జూన్ 8 నుండి శ్రీవారి దర్శనాలు

TTD Darshans To Begin From June 8th

జూన్‌ 8 నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన ఐదో విడత లాక్‌డౌన్‌ ప్రకటనలో దేశవ్యాప్తంగా ఆలయాలు తెరిచేందుకు అనుమతించింది. ఈ మేరకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వెంటనే దర్శనాలు ప్రారంభించనున్నారు. తిరుమల వచ్చే భక్తులకు ఆన్‌లైన్‌, కరెంట్‌బుకింగ్‌ కౌంటర్ల ద్వారా టైమ్‌స్లాట్‌ టిక్కెట్లను కేటాయించనున్నారు. మాస్కులు, గ్లౌజులను తప్పనిసరి చేయనున్నారు. ప్రతిభక్తుడికి అలిపిరి తనిఖీ కేంద్రంలో, మెట్లమార్గంలో వైద్య పరీక్షలు చేస్తారు. హైదరాబాద్‌లో ఆదివారం నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయించనున్నారు. అందుకోసం 40 వేల లడ్డూలను తరలించారు. ప్రస్తుతం ఏపీలోని 12 జిల్లాల్లో లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు తితిదే అందుబాటులోకి తెచ్చింది. ఆరు రోజుల్లో 13 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి.