NRI-NRT

నాట్స్ కరోనా సేవా కార్యక్రమాలు

NATS Corona Charity Events In USA And India

టెంపాబేలోని బ్రాన్‌డన్ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సిబ్బందికి, ఆసుపత్రి బృందానికి నాట్స్ తాంపాబే విభాగం భోజనాన్ని అందించింది. నాట్స్ టెంపా సమన్వయకర్త రాజేశ్ కాండ్రు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డా.రమ్య పిన్నమనేని, విజయ్, ఫణి దలై, సోమంచి ఫామిలీ, సుదర్శన్, రమ కామిశెట్టి, డా. పూర్ణ, తార బిక్కసాని, శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ ఆరికట్ల, సుమంత్ రామినేని తదితరులు పాల్గొన్నారు.

డాలస్ నాట్స్ విభాగం 2000 ఫుడ్ క్యాన్స్‌ను నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌కు విరాళంగా అందించింది. నాట్స్ ఉపాధ్యక్షులు బాపు నూతి, డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ అశోక్ గుత్తా, సెక్రటరీ డి.వి.ప్రసాద్, కోశాధికారి సురేంద్ర ధూళిపాళ్ల, నేషనల్ కో ఆర్డినేటర్ జ్యోతి వనం, బోర్డు డైరెక్టర్లు ఆది గెల్లి, కిషోర్ వీరగంథం, అశోక్ గుత్తా, డీవీ ప్రసాద్, కవిత దొడ్డా, శ్రీథర్ న్యాలమడుగుల, రవి తాండ్ర, భాను లంక, సత్య శ్రీరామినేని, శ్రీనివాస్ పాటిబండ్ల, మార్క్ వనం, వెంకట్ దొడ్డా, జషిత్ వనం, రేహాన్ న్యాలమడుగుల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని చొరవతో సినీ కార్మికులకు నాట్స్ సాయం చేసింది. దాదాపు 34 కుటుంబాలకు నాట్స్ తరపున నిత్యావసరాలను హైదరాబాద్‌లో పంపిణీ చేశారు. నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడిలు మాట్లాడుతూ నాట్స్ సంస్థ ఎల్లపుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన తెలుగు వారికి అండగా ఉంటుందని తెలిపారు.

కరోనా లాక్ డౌన్ తో పనులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న 500 వలస కార్మికుల,పేద కుటుంబాలకు నాట్స్ నిత్యావసర సరుకులు కూరగాయలను కర్నూలులో పంపిణీ చేసింది. నాట్స్ ఉపాధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు కావాల్సిన సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా స్థానిక నాయకులు గౌస్ దేశాయ్, రాధాకృష్ణ, రాజశేఖర్, శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.