ScienceAndTech

కాలితో నొక్కే లిఫ్టు బటన్లు

Now you can call the elevators with your feet

కాలితో నొక్కే లిఫ్టు స్విచ్‌లు.. చెన్నై మెట్రోలో తొలిసారి వినియోగం

★ కరోనా కారణంగా దేనినైనా చేతితో తాకాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది.

★ ఈ నేపథ్యంలో చెన్నై మెట్రో ఓ కొత్త విధానాన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది.

★ సాధారణంగా లిఫ్టు ఎక్కిన తరువాత ఏ ఫ్లోర్‌కు వెళ్లాలో ఆ నెంబరును చేతితో నొక్కుతాం.

★ దీనికి అనుగుంగానే నెంబరు బోర్డు కూడా ఏర్పాటు చేసి ఉంటుంది.

★ అయితే చెన్నైలోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) మాత్రం లిఫ్టులను కొత్త తరహాలో ఏర్పాటు చేసింది.

★ వీటిలో స్విచ్‌లన్నీ కాలి దగ్గర ఉంటాయి.

★ ఏ ఫ్లోర్‌కు వెళ్లాలో ఆ ఫ్లోర్ నెంబరును కాలితో నొక్కాల్సి ఉంటుంది.

★ ఈ విధంగా కాలితో వినియోగించే లిఫ్టు తొలిసారిగా ఇక్కడే వినియోగంలోకి రావడం విశేషం.

★ ఇదిలా ఉంటే ఈ ఫీచర్ ఉన్న లిఫ్టులను ప్రస్తుతం కోయంబత్తూరులోని సీఎంఆర్ఎల్ ప్రధాన భవనంలోనే ఏర్పాటు చేశారు.

★ దశలవారీగా ఇతర స్టేషన్లలోనూ ఈ లిఫ్టులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎంఆర్ఎల్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు