ప్రమాదాల వల్ల కావచ్చు, కాలు జారి కావచ్చు….రకరకాల కారణాలతో వెన్నెముక గాయాల బారినపడేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అలాంటివాళ్లలో కొన్ని నరాలు పూర్తిగా దెబ్బతినడంతో జీవితాంతం ఆయా భాగాలు చచ్చుబడిపోయి పనిచేయడం మానేస్తాయి. అలాగే కంటినాడి దెబ్బతిన్నా కష్టమే. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ నరాలను తిరిగి పనిచేసేలా చేయవచ్చు అంటున్నారు టెంపుల్ యూనివర్సిటీ నిపుణులు. అదెలా అంటే- కణాల పెరుగుదలని నియంత్రించే లిన్28 అనే కణాన్ని గుర్తించారట. దీని ద్వారా దెబ్బతిన్న కేంద్ర నాడీవ్యవస్థ భాగాల్ని పునర్జీవింప చేయవచ్చు అంటున్నారు. ఇది మూలకణాల్ని ప్రభావితం చేయడం ద్వారా న్యూరాన్ల ఉత్పత్తికి కారణమవుతుంది అని చెబుతున్నారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు వీళ్లు ముందుగా గాయపడ్డ ఎలుకలకి లిన్28ని ఇంజెక్టు చేసి చూడగా- అద్భుతమైన ఫలితాలు వచ్చాయట. ఎందుకంటే వెన్నెముక లేదా కంటి నాడి దెబ్బతిన్నవాళ్లలో ఆయా కణాల్ని మళ్లీ పునరుజ్జీవింప చేయగలిగే చికిత్సలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. కాబట్టి దీని ఆధారంగా ఇకనుంచి దెబ్బతిన్న భాగాల్ని మళ్లీ పనిచేసేలా చేయవచ్చు అంటున్నారు.
వెన్నెముక గాయాలకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Related tags :