చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి అన్ని దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడే వ్యాక్సిన్‌ల తయారీ కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వైరస్ బయటపడి ఆరు నెలలు దాటినప్పటికీ వ్యాక్సిన్ తయారీ ఇంకా ప్రాథమిక ప్రయోగాల దశలోనే ఉంది. ప్రస్తుతం వివిధ రకాల మందుల ద్వారా రోగాన్ని నయం చేసే చికిత్సా విధానాలు పరిశీలనలో ఉన్నాయి. అయితే వాటిలో ఏ ఒక్కటీ కచ్చితంగా వైరస్ నుంచి కాపాడతాయనే విషయం ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. తాజాగా లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో కొవిడ్-19 రెండో దశ విజృంభించే ప్రమాదం ఉందన్న అధ్యయనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ సడలించడంపై భయాలు వ్యక్తమవుతున్నాయి.
లైన్‌లో ఉన్న 40 కరోనా వ్యాక్సిన్లు
Related tags :