ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో మరో 535 మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ తగ్గించింది.
సోమవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3500 షాపులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 2965కి తగ్గనుంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలుత 20 శాతం షాపులు తగ్గించింది.
ఇప్పుడు మరో 13 శాతం తగ్గించింది. దీంతో మొత్తం 33శాతం తగ్గించినట్లైంది.
పదమూడు శాతం తగ్గింపును జిల్లాల వారీగా చేశారు.
మద్య నిషేధం లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం అందులో భాగంగానే షాపులను తగ్గించినట్లు చెబుతోంది.