Agriculture

రైతులకు కేంద్ర ప్రభుత్వ కానుక

Central Government Announces Good News For Farmers

రైతులకు ఇది శుభ‌వార్త‌. అన్న‌దాత‌ల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం త‌న ప్రేమ‌ను ప్ర‌క‌టించుకున్న‌ది.

రైతుల పంట‌పై ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు.

కేంద్ర కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్రమంత్రి తోమర్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..రైతులకు అండగా నిలిచేందుకు 14 రకాల వానకాలం ‌ పంటలకు రెట్టింపు చేసిన కనీస మద్దతు ధర అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

వానకాలం పంటలపై 50 నుంచి 83 శాతం అధిక మద్దతు ధర ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.

రైతులకు రుణాలు చెల్లించేందుకు ఆగస్టు వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు.

వీధి వ్యాపారుల కోసం రుణ పథకం అమలు చేస్తామని, రుణ పథకం ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధిచేకూరుతుందన్నారు.