కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతు పవనాలు నిర్ణీత సమయానికే కేరళలోకి ప్రవేశించాయి.
ఈ మేరకు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహాపాత్రా వెల్లడించారు.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల సీజన్‌లో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతం నమోదవుతుందని ఆయన తెలిపారు.
దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 75 శాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది.
మే 30నే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకటించగా, భారత వాతావరణశాఖ మాత్రం విభేదించింది.
నైరుతి రుతు పవనాలు ఇవాళే కేరళను తాకినట్టు స్పష్టం చేసింది.