NRI-NRT

అలరించిన నాట్స్ జానపద వెబినార్

NATS Folk Songs Webinar via Zoom Entertains USA NRTs

నాట్స్ వెబినార్ ద్వారా జానపద కళకారులచే పల్లె పాటల కార్యక్రమాన్ని నిర్వహించింది. న్యూజెర్సీ నాట్స్ విభాగం ఆధ్వర్యంలో దాదాపు 20 మంది జానపద కళకారులు అనేక ప్రాంతాల నుంచి వెబినార్ ద్వారా అనుసంధానమై.. పల్లెపాటలను హోరెత్తించారు. నాట్స్ మాజీ అధ్యక్షుడు, బోర్డ్ డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ సాంస్కృతిక సభ్యుడు శేషగిరిరావు(గిరి)కంభంమెట్టు దీనికి వ్యాఖ్యతగా వ్యవహారించారు. ప్రముఖ జానపద కళాకారులు డా.లింగా శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహారించి రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల జానపద కళాకారులను వెబినార్ ద్వారా సమన్వయపరిచారు. జూమ్‌లో జానపదం పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు మూడు గంటల పాటు అమెరికాలో ఉంటున్న తెలుగువారికి తమ పల్లెలను గుర్తు చేసింది. వంశీ వెనిగళ్ల సాంకేతిక సహకారాన్ని అందించారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి నిర్వాహకులను అభినందించారు.