DailyDose

మల్లన్న సొమ్ములు మింగిన 26మంది రిమాండ్-నేరవార్తలు

Srisailam Temple Scam Members Remanded-Telugu crime news

* శ్రీశైల దేవస్థానం లో జరిగిన అవినీతిపై విచారణలో రెండు కోట్ల 12 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు గుర్తించామని ఆత్మకూరు డిఎస్పి వెంకట్రావు తెలిపారు. దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు. ఈ ప్రాథమిక విచారణలో 26 మంది నిందితులపై406,420, 407,65,67,120బ్, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో ముగ్గురు శాశ్వత ఆలయ ఉద్యోగులు, మిగతావారు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఇందులో 83 లక్షల రూపాయల వరకు డబ్బులు రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రోజు 26 మంది నిందితులను రిమాండ్ కు. పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

* పెద్దపల్లి జిల్లా సింగరేణి కోల్ మైన్స్ ఋఘ్3 పరిధి లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 1 లో భారీ పేలుడు సంభవించింది.

* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామంలో పాత కక్ష్యలతో చల్లూరి దుర్గయ్య(45) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన దాగం సురేందర్ అనే వ్యక్తి బండ రాయితో తలపై మోదడంతో దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగపేట గ్రామంలో చల్లూరి దుర్గయ్య, దాగం సురేందర్ ల ఇళ్ళుళు పక్క పక్కనే ఉండడంతో చిన్న గోడ విషయంలో వీరిద్దరికీ ఎప్పటి నుండో తగాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా తగాదా జరగి మాట మాట పెరిగడంతో కోపోద్రిక్తుడైన సురేందర్ దుర్గయ్య, అతని భార్యపై దాడికి దిగి పక్కనే ఉన్న బండ రాయితో దుర్గయ్య తలపై మోదడంతో దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

* భాగ్యనగర్ కాలనీ ఎస్ బి ఐ బ్యాంకులో అగ్నిప్రమాదం మంటలను అర్పుతున్న ఫైర్ సిబ్బంది*

* రామగుండం సింగరేణి ఓపెన్​కాస్ట్​లో ప్రమాదం..నలుగురు మృతి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఉపరితల గని-1లోని ఫేస్‌-2లో ప్రమాదం సంభవించింది.

* అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులర్పించిన సిఎం కేసిఆర్…కేసిఆర్ కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన ఓ యువకుడు…అరెస్టు చేసిన పోలిసులు.

* తిరుపతి నగర పరిధిలోనున్న అన్నారావు సర్కిల్ సమీపంలోని లక్ష్మి అపార్ట్మెంట్ లో ఘటన. లక్ష్మీ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వెంకటరెడ్డి కుమారుడు చరణ్ శశిధర్ రెడ్డి(21)గా అలిపిరి పోలీసులు గుర్తింపు.

* మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఏ రేవంత్ రెడ్డిని కొడంగల్ లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు