* చైనాకు చెందిన యాప్‌లను గుర్తించి, తొలగించేందుకు ‘రిమూవ్ చైనా యాప్స్’ పేరుతో ప్లేస్టోర్‌లో ఓ యాప్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో టాప్ ఫ్రీ యాప్స్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మే 17న ఈ యాప్‌ను ప్లేస్టోర్‌లోకి తీసుకురాగా, కేవలం రెండు వారాల్లోనే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 మిలియన్ డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతోంది.
* టిక్‌టాక్, హెలో యాప్‌ల యజమాని బైట్‌డాన్స్ త్వరలో భారత్‌లో రెండో కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేయనుంది. భారత్‌లో తన మూలాలను పెంచుకోవాలని ఈ చైనా కంపెనీ భావిస్తోంది. ఈ కొత్త సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బైట్‌డాన్స్‌కు ఉన్న అన్ని యాప్‌లు, ప్లాట్‌ఫామ్స్‌కు ఐటీ, ఐటీ ఆధారిత సేవలు అందజేయనున్నారని ఈ పరిణామాలతో సంబంధమున్న విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్లపత్రిక తన కథనంలో పేర్కొంది. వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్ పెంచడంపైనా ఈ కంపెనీ దృష్టిసారించనుంది.
* దేశీయ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 33,633 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 95 పాయింట్లు ఎగబాకి 9,921 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.08 వద్ద కొనసాగుతోంది. ఆటో, ఫార్మా రంగాల షేర్ల మద్దతుతో పాటు ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలడం సూచీలకు దన్నుగా నిలిచింది.
* విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరను కిలో లీటర్ (1000 లీటర్లు)కు 56.5 శాతం చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు సోమవారం ప్రకటించాయి. ఫలితంగా దిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.12,126.75 పెరిగి రూ.33,575.37కు చేరింది. ఫిబ్రవరి నుంచి వరుసగా 7 సార్లు ఏటీఎఫ్ ధరను తగ్గించిన సంస్థలు పెంచడం ఇప్పుడే. అయినా కూడా అప్పటిధరతో పోలిస్తే, దాదాపు సగం మేర తక్కువగానే ఉంది. ఏటీఎఫ్ ధరలను ప్రతినెలా 1, 16 తేదీల్లో సవరిస్తుంటారు. మార్చి చివరివారం నుంచి మే 25 వరకు విమాన సర్వీసులు నడవనందున, ధరల తగ్గింపు ప్రయోజనాన్ని సంస్థలు పొందలేకపోయాయి.
* హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) బీఎస్-6 ప్రమాణాలతో సీడీ 110 డ్రీమ్ బైకును విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.62,729 (ఎక్స్-షోరూమ్ దిల్లీ). ఇందులో ఇంజిన్ స్టార్ట్, స్టాప్ స్విచ్, పొడవైన సీటు, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ‘1966 నుంచి ప్రపంచవ్యాప్తంగా సీడీ బ్రాండు కోట్ల మంది అభిమానాన్ని గెలుచుకుంది. కొత్త సీడీ 110 డ్రీమ్ బీఎస్-6 దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. అధునాతన టెక్నాలజీ, మెరుగైన పనితీరు, మైలేజీ వంటివి దీని సొంతం’ అని హెచ్‌ఎంఎస్‌ఐ డైరెక్టర్ (అమ్మకాలు, మార్కెటింగ్) యద్వీంధర్ సింగ్ గులేరియా అన్నారు.