ScienceAndTech

చైనాకు గూగుల్ వత్తాసు

Google play store kicks remove china apps out

యాంటీ చైనా సెంటిమెంట్‌ నేపథ్యంలో అనతికాలంలో పాపులారిటీ సంపాదించిన ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ యాప్‌ను గూగుల్‌ తన ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. థర్డ్‌ పార్టీ యాప్‌లను తొలగించాలని ప్రోత్సహించేలా ఈ యాప్‌ ఉండడంతో తన పాలసీకి విరుద్ధంగా ఉన్నందుకే ఈ యాప్‌ను తొలగించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ యాప్‌ను రూపొందించిన జైపూర్‌కు చెందిన వన్‌ టచ్‌ యాప్‌ ల్యాబ్స్‌ సైతం ఈ విషయాన్ని ద్రువీకరించింది.