DailyDose

జగన్ సర్కార్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ-తాజావార్తలు

Supreme Orders YS Jagan Administration To Remove Colors

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నాలుగువారాల్లో రంగులు తొలగించాలని ఆదేశించింది. వైకాపా జెండాను పోలిన రంగులను నాలుగు వారాల్లో తొలగించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉందన్న సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు తర్వాత రంగులు తొలగించకుండా తప్పు చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకసారి జీవో కొట్టివేసిన తర్వాత మళ్లీ వేరే రంగు జతచేసి జీవో ఎందుకు తెచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 623ని న్యాయస్థానం రద్దు చేసింది.

* రంగుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బరాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఎదురుదెబ్బలు తప్పవునిమ్మగడ్డ రమేశ్ విషయంలోనూ ఆదేశాలను ఇప్పటి వరకూ అమలు చేయలేదునిమ్మగడ్డ విషయంలోనూ సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించిందిఇప్పటికైనా దూకుడు తగ్గించుకుని నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలిబీజేపీ ఎంపీ జీవీఎల్

* చైనా, యూరప్‌లలో వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌ రకమే రూపాంతరం చెంది భారత్‌లోనూ విస్తృతంగా వ్యాపించినట్లు జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ)కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. అలా కరోనా వైరస్‌ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని తెలిపారు. దిల్లీ, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్‌ ఎక్కువగా రూపాంతరం చెందినట్లు గుర్తించినట్లు వెల్లడించారు.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలఖరుతో ఆమె పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు పొడిగించాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు స్పందించిన కేంద్రం సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

* ప్రజలకు నవరత్నాలు పంచుతామని చెప్పిన వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకు తింటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. దళితులపై వైకాపా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో దొంగలు పాలకులు అవుతారని బ్రహ్మంగారు చెప్తే ఎవరి గురించో అనుకున్నాం.. కానీ, ఆయన చెప్పింది వైకాపా నేతల గురించేనని ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.

* దాదాపు రెండు నెలల తర్వాత జూన్‌ 1 నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు ప్రారంభమైన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి చేసింది. జంట నగరాలైన సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్‌ (నాంపల్లి) స్టేషన్‌లోనూ రైలు సేవలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ రెండు స్టేషన్లనూ తమ ప్రయాణాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. ఈ రెండు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు థర్మల్‌ స్క్రీనింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

* ‘ఐఎన్‌ఎక్స్‌ మీడియా’ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఇ-ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించిన తొలి అభియోగపత్రం ఇది. కాగా, 2007 చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్‌ మీడియా సంస్థలోకి విదేశీ పెట్టుబడులు భారీగా తరలివెళ్లడానికి సహకరించారని, దాని నుంచి కార్తి చిదంబరం లబ్ధి పొందారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తూ.. కేసులు నమోదు చేశాయి.

* ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటోంది. అయితే, కరోనా తీవ్రత అధికంగా ఉన్న బ్రిటన్‌లో కొన్ని దేశాలకు చెందిన వారే ఎక్కువగా మరణిస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన తెల్లజాతీయుల కంటే ఇతర అల్పసంఖ్యాక జాతీయులే ఎక్కువగా మరణిస్తున్నట్లు తాజాగా బ్రిటన్‌ ప్రజారోగ్య నివేదిక (పీహెచ్‌ఈ) వెల్లడించింది. గత సంవత్సర నివేదికలో మాత్రం మారణాల రేటు తెల్లజాతీయుల్లోనే ఎక్కువగా ఉన్నట్లు పీహెచ్‌ఈ పేర్కొంది.

* పెద్దమొత్తంలో సమాచారంతో కూడిన ఫైల్‌ను ఇతరులకు షేర్‌ చేయాలంటే ఎక్కువ మంది వినియోగించేది వియ్‌ ట్రాన్స్‌ఫర్‌ వెబ్‌సైట్‌నే. కొద్ది రోజుల క్రితం టెలికం మంత్రిత్వ శాఖ (డీవోటీ) ఆ సైట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. అయితే, ఏ కారణంతో ఈ వెబ్‌సైట్‌ను నిలిపివేశారనే దానిపై మాత్రం ఇంత వరకు స్పష్టతలేదు. అలానే వియ్‌ ట్రాన్స్‌ఫర్‌ సంస్థ కూడా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

* మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. కొవిడ్‌-19 ప్రభావం వల్ల పెట్టుబడులు, ఉపాధి కల్పన, సృజనాత్మకత, విద్యారంగం, వాణిజ్యం, సరఫరా, వినియోగం వంటి అంశాలు బలహీనమయ్యాయని సంస్థ ఓ ప్రకటనలో వివరించింది. ఆధునిక కాలంలో ఎన్నడూ లేని విధంగా కొవిడ్‌-19 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదలపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ అన్నారు.

* యాంటీ చైనా సెంటిమెంట్‌ నేపథ్యంలో అనతికాలంలో పాపులారిటీ సంపాదించిన ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ యాప్‌ను గూగుల్‌ తన ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. థర్డ్‌ పార్టీ యాప్‌లను తొలగించాలని ప్రోత్సహించేలా ఈ యాప్‌ ఉండడంతో తన పాలసీకి విరుద్ధంగా ఉన్నందుకే ఈ యాప్‌ను తొలగించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ యాప్‌ను రూపొందించిన జైపూర్‌కు చెందిన వన్‌ టచ్‌ యాప్‌ ల్యాబ్స్‌ సైతం ఈ విషయాన్ని ద్రువీకరించింది.

* బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ సోదరుడు లైంగికంగా వేధించాడని నటుడి మేనకోడలు ఆరోపించారు. ఈ మేరకు దిల్లీలోని జామియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కొన్నేళ్ల క్రితం నవాజుద్దీన్‌ అంకుల్‌ సోదరుడు నాతో తప్పుగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని అప్పుడే నవాజుద్దీన్‌ అంకుల్‌కు చెబితే నమ్మలేదు. ‘అతడు నీకు మామయ్య.. అలా ప్రవర్తించడు’ అని చెప్పాడు’ అని తెలిపారు.

* వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడటం ఇకపై సవాలేనని టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య భావిస్తున్నాడు. ఇక తాను పొట్టి క్రికెట్‌పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాడు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ వివాదంతో ఏకాగ్రత చెదిరిపోయిందని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్‌ మాజీ కోచ్‌ రికీ పాంటింగ్‌ తనను కొడుకులా ఆదరించారని గుర్తుచేసుకున్నాడు.