తబ్లిగీ జమాతే కార్యకలాపాల్లో భాగ స్వామ్యమైన 2550మంది విదేశీయులను పదేళ్లపాటు భారత్‌లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది.
పర్యటక వీసాపై దేశంలోకి వచ్చి.. అనుమతి లేకుండా దిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్లో జరిగిన మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి.
అందులో పాల్గొన్నవారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా రావడం కలకలం రేపింది.
ఈ సమావేశాలే దేశంలో వైరస్ వ్యాప్తికి కేంద్రబిందువులుగా నిలిచాయి.
ఈ మేరకు తబ్లిగీ జమాతే కార్యక్రమాల్లో పాల్గొన్న.. 2550 మందికిపైగా విదేశీయులను కేంద్రం బ్లాక్ లిస్టులో పెట్టింది.
వారిని పదేళ్లపాటు దేశంలోకి రాకుండా నిషేధం విధించింది.