కథానాయిక మీరాచోప్రాకు తారక్ ఫ్యాన్స్ అంటూ ట్వీట్ చేస్తున్న కొందరు నెటిజన్లకు మధ్య ట్విటర్‌వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘నాకు ఆయన గురించి తెలియదు. నేను ఆయన అభిమానిని కాదు.. మహేశ్ బాబు అంటే ఎక్కువ ఇష్టం’ అన్నందుకు మీరా చోప్రాను అసభ్యపదజాలంతో దూషిస్తూ, ట్విటర్ వేదికగా దుమ్మెత్తిపోశారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఆమె మరి కొన్ని ట్వీట్లు చేశారు. ‘‘దీన్ని ఎలా ఆపడం? మహిళలకు గౌరవం లేదు. కనీసం మా గొంతును కూడా వినిపించనివ్వరా? మా తల్లిదండ్రులు చనిపోవాలని కోరుకున్నారు. నాపై సామూహిక అత్యాచారం చేస్తామని, యాసిడ్ దాడి చేస్తామని బెదిరించారు. నన్ను అసభ్యపదజాలంతో దూషించారు. ఈ రోజు నేను, రేపు మరొకరు. ఈ పోరాటంలో నేను నిలబడతా. ఇప్పుడు వాళ్లు(ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ ట్వీట్ చేస్తున్న వాళ్లు) మిగతా నటులను కూడా అవమానపరుస్తున్నారు. అసలు వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారు. మహిళా గౌరవం గురించి పక్కన పెట్టండి, కనీసం వారు ఎవ్వరికీ గౌరవం ఇవ్వడంలేదు. నన్ను ఎవరైతే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారో వారందరికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ప్రస్తుతం మనమంతా కొవిడ్-19 రూపంలో ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో ఎంతోమంది ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్నారు. కానీ, మీరు మాత్రం.. మీ అభిమాన నటుడు నాకు తెలియదన్నందుకు నన్ను దూషిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ముందు వెళ్లి మీ జీవితాలను రక్షించుకోండి’’ అంటూ మీరాచోప్రా ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
నా గ్యాంగ్‌రేప్ తర్వాతలే గానీ…ముందు నీ బతుకు చూసుకో!
Related tags :