Business

థియేటర్లు తెరుస్తారా?

Prakash Javadekar Speaks On Movie Theater ReOpen

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో సినిమా థియేటర్లను తిరిగి పునః ప్రారంభించే అంశాన్ని జూన్ నెలలో నమోదయ్యే కరోనా కేసులు, పరిస్థితిని బట్టి అలోచించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

తాజాగా చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సులో చర్చించిన మంత్రి పైవిధంగా స్పందించారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా సినీరంగం కోట్లలో నష్టపోయినప్పటికీ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వారు సంఘీభావం తెలపడం అభినందనీయం అని జవదేకర్ అన్నారు.

వేతనాల్లో సబ్సిడీలు, రుణాలపై మూడు నెలల వడ్డీ మాఫీ, పన్నులు, ఇతరత్రా డిమాండ్లను సినీ సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఈ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

మరోవైపు చిత్ర నిర్మాణ పనులు ప్రారంభించటంపై ఇప్పటికీ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

అన్ లాక్ -1లో భాగంగా జూన్ 8న హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్ధనా మందిరాలు తెరుచుకోనుండగా.. సినిమా థియేటర్ల విషయంలో మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు మూసి ఉంచాలని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.