* ముసునూరు MRO మదన్మోహన్రావు పై మూకుమ్మడిగా మహిళల దాడి.తమ భూమిని వేరొకరి పేరిట మార్చారనే బాధతో ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన చుండ్రు రాజశేఖర్ మండల కార్యాలయం ఎదుట పురుగులమందు సేవించి ఆత్మహత్యయత్నంగమనించిన మహిళలు ఆవేశంతో ముసునూరు మండలం తహసిల్దార్ మదన మోహన రావు పై దాడికి ప్రయత్నించారు.ఈ ఘటనతో పోలీసులు తహసీల్దార్ ను ప్రత్యేకమైన గదిలో రక్షణ వలయం నడుమ ఉంచారు.
* కుప్పం ఏఎస్ఐ రాజేంద్ర(57)బుధవారం కుప్పం పట్టణం గాండ్ల వీధిలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
* గుడివాడ ధనియాల పేట లో ఇటీవల జరిగిన దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.పచ్చళ్ళ వ్యాపారి నీ బెదిరించి దొంగలించిన 10 లక్షల నగదు,బంగారు ఆభరణాల చోరీ కేసులో గుడివాడలో ఎస్ పి రవీంద్ర బాబు మీడియా సమావేశం.చోరీకేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి , దొంగలించిన నగదు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
* సత్యవేడు సర్కిల్ పరిధిలో అక్రమంగా తరలిపోతున్న కంకర రాళ్లు, ఇసుకకు సంబంధించి ఆరు లారీలను తిరుపతి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.
* గుంటూరు జిల్లాలోని ఓ హోటల్‌లో ఆహారం తిని 20 మందికి అస్వస్థత…ఆసుపత్రులకు తరలింపు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో తెరచుకున్న గుంటూరు జిల్లాలోని ఓ హోటల్‌లో ఈ రోజు ఉదయం కలకలం రేగింది.
* వనస్థలిపురం కు చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టు లో హెబిఎస్ కార్పస్ పిటిషన్…తన భర్త కరోనా వచ్చిందని గాంధీకి తరలించారని ఇప్పటి వరకు తన సమాచారం ఇవ్వలేదన్న పిటీషనర్..అసలు తన భర్త మధుసూదన్ బ్రతికి ఉన్నాడా లేడా అని ప్రభుత్వం ను ప్రశ్నించిన హైకోర్టు.
* రోడ్డుప్రమాదంలో మంచిర్యాల SPF కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణ శివారులోని మదన పోచమ్మ గుడి సమీపాన రోడ్డు పై ఉన్న కంకర కుప్ప వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కోటపల్లి కి చెందిన కిష్టయ్య గౌడ్ కంకర కుప్పను గ్రహించక ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి, చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో తరలించగా మెరుగైన వైద్యం కొరకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియజవర్గంలో భూ వివాదం విషయంలో జరిగిన హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ జగదీష్ తెలిపారు.
గురువారం సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించారు.