అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరువాత నిరసనలు వెల్లువెత్తగా, పలు ప్రాంతాల్లో నిరసనకారుల ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వాషింగ్టన్ లోని భారత ఎంబసీ వెలుపల ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాం పాక్షికంగా ధ్వంసమైంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని నాశనం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు విగ్రహంపై ముసుగు కప్పారు. జరిగిన ఘటనపై అమెరికా రాయబారి కెన్ జస్టర్ ఇండియాకు క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనపై తామెంతో చింతిస్తున్నామని, తమ క్షమాపణలను స్వీకరించాలని అన్నారు. విగ్రహ ధ్వంసంపై యునైటెడ్ స్టేట్స్ పార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆయన తెలిపారు.
డీసీలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిరసనకారులు
Related tags :