హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్ మళ్ళీ ప్రారంభం : ప్రపంచ ఆరోగ్య సంస్థ
కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది.
మలేరియా కట్టడికోసం వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను మళ్లీ కరోనా వైరస్ పేషెంట్లపై పరీక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సుముఖత చూపింది.
క్లినికల్ ట్రయల్స్ తిరిగి ప్రారంభమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
కోవిడ్19 రోగులు హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుంటే, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని గతంలో ల్యాన్‌సెట్ మెడికల్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది.
దీంతో మే 25వ తేదీ నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధం విధించింది.
కాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సాలిడారిటీ ట్రయల్ అని పిలవబడే ఎగ్జిక్యూటివ్ బృందం తాజాగా కొత్త నిర్ణయం తీసుకున్నది.