భారత్, చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్ ప్రాంతంలో పెరిగిన వేడి- మధ్యవర్తిత్వం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనతో చల్లారిపోయింది. జూన్ అయిదో తేదీన చైనా, భారత సైనికులు ఉత్తర సరిహద్దుల్లో ఇరుపక్షాల సైనికులు ముఖాముఖి తలపడ్డారు. అంతకుముందు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిమ్‌లలో సైతం ఇరుపక్షాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక పక్క చైనా ప్రభుత్వం సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతుండగా, నేపాల్‌లోని కమ్యూనిస్టు ప్రభుత్వం భారత్‌తో సంప్రదాయ, చిరకాల సంబంధాల్ని విస్మరిస్తూ గిల్లికజ్జాలకు దిగింది. భారీ స్థాయిలో రుణాలు ఇవ్వడం ద్వారా నేపాల్‌పై భారం మోపిన చైనా, భారత్‌కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడేలా ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ కారణంగానే నేపాల్ మూడు భారత భూభాగాలను తనవిగా చెప్పుకుంటోంది.
అప్పులిచ్చి నేపాల్‌ను ఎగదొస్తున్న డ్రాగన్
Related tags :