యాపిల్ మొక్క తయారు చేసే ఎమిగ్‌డాలిన్ అనే సమ్మేళన పదార్థం యాపిల్ విత్తనాల్లో ఉంటుంది. ఇది మానవ జీర్ణప్రక్రియ ఎంజైమ్‌లతో కలిసిందంటే సైనైడ్ విడుదలవుతుంది. యాపిల్ విత్తనాలపై చాలా గట్టిపూత ఉంటుంది. అందువల్ల విత్తనం లోపలి పదార్థం జీర్ణప్రక్రియ ఎంజైమ్‌లతో కలవదు. పొరపాటున ఎవరైనా ఈ విత్తనాలను మింగినా ప్రమాదం ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ విత్తనం మానవ శరీరంలో ఎటువంటి మార్పు చెందకుండానే విసర్జితం అయిపోతుంది. కానీ యాపిల్ విత్తనాలను నమిలి తింటే మాత్రం విష ప్రభావానికి లోనవుతారు. రెండు లేదా మూడు విత్తనాలతో అయితే ప్రమాదం ఉండదు. ఇవి తక్కువ పరిమాణంలో సైనైడ్‌ను విడుదల చేస్తాయి. దీన్ని శరీరం తట్టుకోగలదు. ఎక్కువ పరిమాణంలో ఈ విత్తనాలను నమిలి మింగితే మాత్రం అనారోగ్యానికి గురవుతారు. కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగీ, ఆల్గేవంటివి మొక్కల్లో ఎమిగ్‌డాలిన్ సమ్మేళన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. యాపిల్ విత్తనాల్లోనే కాదు… చేదు బాదం కాయలు, ఖర్జూరం పండు వంటి వాటి విత్తనాల్లోనూ ఈ ఎమిగ్‌డాలిన్ ఉంటుంది.
యాపిల్ విత్తనాల్లో సైనేడ్ ఉంటుందా?
Related tags :