ScienceAndTech

కరోనా సమయంలో పెరిగిపోయిన సైబర్‌క్రైం

Cybercrimes during corona lockdown has risen sharply

ఈ అయిదు నెలల్లో నమోదైన కేసులపై సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్‌ అధ్యయనం చేసి మూడు రకాల మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు.

* 24 గంటల్లో కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే మీ పేటీఎం ఖాతా స్తంభించిపోతుందంటూ ఎస్‌ఎంఎస్‌ పంపించి ముగ్గులోకి దింపుతున్నారు. కొందరు లింక్‌ పంపి ఖాతా వివరాలడుగుతున్నారు. మరికొందరు క్విక్‌ సపోర్ట్‌, ఎనీ డెస్క్‌ యాప్‌, టీం వ్యూయర్‌ తదితర రిమోట్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోమంటున్నారు. రూపాయి లేదా రూ.10 పేటీఎం వ్యాలెట్‌లో జమచేసే క్రమంలో డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకుని ముంచేస్తున్నారు.
* బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని.. మీ కార్డు బ్లాక్‌ అవుతోందని ఓటీపీ, ఇతర వివరాలను తెలుసుకుని టోకరా వేస్తున్నారు.
* ఎయిర్‌టెల్‌, ఐడియా కస్టమర్‌ కేర్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని సిమ్‌ కార్డు బ్లాక్‌ పేరిట మోసగిస్తున్నారు.
* మియాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి మే 24న ఓ నంబరు నుంచి కాల్‌ వచ్చింది. పేటీఎం కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నామని.. కేవైసీని అప్‌డేట్‌ చేసుకోకపోతే బ్లాక్‌ అవుతుందంటూ చెప్పి నిమిషాల్లోనే రూ.2.50 లక్షలు కొల్లగొట్టారు. హఫీజ్‌పేట్‌కు చెందిన ఓ మహిళకు సైతం ఇలానే ఫోన్‌ చేసి రూ.1.50 లక్షలు స్వాహా చేశారు. ఆమె ఈనెల 2న సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.