Fashion

నగల పెట్టెలు భలే బాగున్నాయి

Telugu fashion news - jewellery storing boxes

నగలు మాత్రమే కాదు, వాటిని భద్రపరిచే పెట్టెలు కూడా అందంగా ఉండాలి ఆడవారికి. అందుకే జ్యువెలరీ బాక్సులు ఎప్పటికప్పుడు విభిన్నంగా వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా మార్కెట్లో దొరుకుతున్నవే ఈ డిజైనర్‌ ట్రింకెట్‌ బాక్సులు. ఇవి కేవలం నగల పెట్టెలుగానే కాదు… అలంకరణ వస్తువులుగానూ ఉపయోగపడతాయి. డ్రెస్సింగ్‌ టేబుల్‌ మీదో లేక షోకేస్‌లోనో వీటిని ఉంచితే మంచి లుక్‌ వస్తుంది అనడంలో సందేహమే లేదు. రంగురంగుల్లో ఎంతో చక్కగా కనిపించే ఈ పెట్టెల్లో రథం, పడవ, స్ట్రాబెర్రీ, పూలబుట్ట, నెమలీ… వంటి ఆకారాలు ఆకట్టుకుంటున్నాయి. రాళ్లు పొదగడం వల్ల వచ్చే మెరుపు చూడాల్సిందే కానీ చెప్పడానికి వీల్లేదు.