Sports

“భాంగీ” అన్నందుకు క్షమాపణలు

“భాంగీ” అన్నందుకు క్షమాపణలు

ఇటీవల టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో కలిసి పాల్గొన్న ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ కార్యక్రమంలో స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశాడు. చాహల్‌ గురించి మాట్లాడుతూ అతను ‘భాంగి’ అనే పదాన్ని వాడటంపై ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో యువీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాడు. ‘‘స్నేహితులతో సంభాషిస్తున్నపుడు అపార్థంతో ఆ మాట అన్నాను. ఒక బాధ్యతాయుతమైన భారతీయుడిగా అనుకోకుండా ఎవరి మనోభావాలనైనా దెబ్బ తీసి ఉంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. కులం, రంగు లాంటి వాటి ఆధారంగా నేనెప్పుడూ ఎవరి మీదా వివక్ష చూపడాన్ని నేను అంగీకరించను’’ అని యువీ అన్నాడు.