Health

కాఫీపొడితో చర్మ సౌందర్యం

కాఫీపొడితో చర్మ సౌందర్యం

కాఫీ పౌడర్‌తో ఇలా చేస్తే మీ ముఖం మెరవడం ఖాయం..

కాఫీ…నిద్ర లేవగానే కాఫీ, ఆఫీస్ నించి అలసిపోయి ఇంటికోస్తే కాఫీ… కాఫీ మన జీవితంలో కలిసిపోయింది. అయితే, కాఫీ ని తాగడానికే కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసుకోండి..

కాఫీ పౌడర్‌తో ఇలా చేస్తే మీ ముఖం మెరవడం ఖాయం..

కాఫీ స్కిన్ కి కూడా ఎంతో మంచిది. కాఫీ తాగితే ఎంత ఉత్తేజంగా ఉంటుందో, కాఫీ ఉన్న క్రీం నో, సోప్ నో వాడితే స్కిన్ కి కూడా అంతే ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకో తెలుసుకోండి.

1. యాంటీ-ఆక్సిడెంట్స్‌‌తో అందం..

బయట ఉన్న పొల్యూషన్ కి స్కిన్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. కాఫీ లో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ కారణంగా కాఫీ ప్రోడక్ట్స్ స్కిన్ ని కాపాడుతాయి.

2. సూర్య కిరణాల నుంచి రక్షణగా..

అల్ట్రా వయొలెట్ రేస్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా రావచ్చు. అయితే, కెఫీన్ స్కిన్ ని ఈ యూవీ రేస్ నించి రక్షిస్తుంది.

3. స్కిన్ ని స్మూత్ గా చేస్తుంది

కెఫీన్ టిష్యూ రిపేర్ కి సహకరిస్తుంది. అందువల్ల సెల్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా స్మూత్ గా మంచి గ్లో తో ఉంటుంది.

4. బ్లడ్ సర్క్యులేటర్‌గా..

కాఫీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి స్కిన్ కూడా హెల్దీ గా ఉంటుంది. చర్మం ఎక్కడన్నా ఉబ్బినట్టుగా ఉన్నా దాన్ని తగ్గిస్తుంది. కావాలనుకుంటే కాఫీ క్యూబ్స్ తయారు చేసుకుని వాటిని అవసరమున్న చోట వాడుకోవచ్చు.

ఇన్ని ఎమేజింగ్ బెనిఫిట్స్ ఉన్న కాఫీని స్కిన్ కోసం ఎలా వాడాలి?

1. ఫేస్ స్క్రబ్

కాఫీ పొడి, బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్ లా చెయ్యండి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద గుండ్రంగా మసాజ్ చెయ్యండి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని పోగొడుతుంది. ఇది ఏ మాత్రం స్కిన్ మీద హార్ష్ గా ఉండదు.

2. స్కాల్ప్ ఎక్స్‌ఫోలియేటర్‌‌గా

స్కాల్ప్ ని శుభ్రం చెయ్యడానికి కూడా కాఫీ పనికొస్తుంది. అర కప్పు కాఫీ పొడి తీసుకుని తడి జుట్టు మీద రెండు మూడు నిమిషాలు మసాజ్ చెయ్యండి. తరవాత మామూలుగా మీ షంపూ, కండిషనర్ తో వాష్ చేసెయ్యండి. ఇది స్కాల్ప్ మీద పేరుకున్న డెడ్ సెల్స్ ని పోగొడుతుంది.

3. బాడీ స్క్రబ్

కాఫీ స్కిన్ ని టైట్ గా చేస్తుంది. ఎక్కడైనా సెల్యులైట్ బిల్డప్ అయితే దాన్ని కాఫీ తో పోగొట్టుకోవచ్చు. కాఫీ, బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ తో పేస్ట్ తయారు చేసి దాన్ని అవసరమున్న ఏరియాస్ మీద మసాజ్ చెయ్యండి. మీ స్కిన్ టైప్ ని బట్టి ఇది రోజూ కూడా చెయ్యచ్చు.

4. స్కిన్ బ్రైటనర్

మీ స్కిన్ మెరుస్తూ ఉండాలంటే కాఫీ మాస్క్ ట్రై చెయ్యండి. అర కప్పు కాఫీ పొడి లో కొంచెం పాలు పోసి థిక్ పేస్ట్ చెయ్యండి. దీన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగెయ్యండి.

5. పఫ్ఫీ ఐస్ ప్రాబ్లమ్‌ దూరం..

కాఫీ లో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచి కళ్ళ దగ్గర ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. డికాషన్ తీశాక మిగిలిపోయిన కాఫీ పొడిని చల్లారనివ్వండి. దాన్ని కంటి మీదా, కంటి చుట్టూతా అప్లై చేసి నాలుగైదు నిమిషాల తరవాత కడిగెయ్యండి. లేదా కాఫీ క్యూబ్స్ ని మెత్తటి బట్టలో చుట్టి నెమ్మదిగా పాట్ చెయ్యండి. అక్కడే ఉంచి వదిలెయ్యద్దు.