భారత మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఒకవేళ ఐసీసీ అధ్యక్షుడైతే తన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని పాకిస్థాన్ ఆటగాడు దనిశ్ కనీరియా అన్నాడు. ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పదవీకాలం త్వరలోనే ముగుస్తున్న నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా మాజీ సారథి, ప్రస్తుత డైరెక్టర్ గ్రేమ్‌స్మిత్ ఇటీవల మాట్లాడుతూ తర్వాతి అధ్యక్షుడిగా గంగూలీ సరిపోతాడని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలోనే కనీరియా కూడా దాదాకు మద్దతిచ్చాడు. కనీరియా 2012లో ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ ఆడుతూ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు.
గంగులీకి నా మొర వినిపిస్తా!
Related tags :