కథానాయిక తాప్సి దక్షిణాదిలో కెరీర్ ఆరంభించినప్పటికీ బాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్నారు. 2010లో ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఆమె నటిగా అరంగేట్రం చేశారు. ఆపై పలు తెలుగు సినిమాల్లో అలరించారు. 2015లో ‘బేబీ’ సినిమా తర్వాత తాప్సికి హిందీలోనూ గుర్తింపు లభించింది. ఆపై అక్కడే వరుస విజయాలు అందుకున్నారు. 2019లో ఆమె నటించిన ‘బద్లా’, ‘గేమ్ ఓవర్’తోపాటు మరో మూడు చిత్రాలు విడుదలై.. మంచి టాక్ అందుకున్నాయి. కాగా ఇవన్నీ రూ.352.13 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇందులో కేవలం ‘మిషన్ మంగళ్’ సినిమా రూ.200 కోట్లు సాధించింది.తాప్సి గత ఐదు సినిమాలు ‘బద్లా’ రూ.88 కోట్లు (మార్చి 8 2019), ‘గేమ్ ఓవర్’ రూ.4.69 కోట్లు (జూన్ 14 2019- కేవలం హిందీలో), ‘మిషన్ మంగళ్’ రూ.202.98 కోట్లు (ఆగస్టు 15 2019), ‘సాండ్కీ ఆంఖ్’ రూ.23.40 కోట్లు (అక్టోబరు 25 2010), ‘థప్పడ్’ రూ.33.06 కోట్లు (ఫిబ్రవరి 28 2020) మొత్తం రూ.352.13 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 2019లో బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నటిగా తాప్సి నిలిచారని అన్నారు. ఈ నేపథ్యంలో తాప్సి ట్వీట్ చేశారు. ‘హో నైస్.. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఈ క్వారంటైన్లో ఓ శుభవార్తగా దీన్ని పరిగణించి.. నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుని సెలబ్రేట్ చేసుకోవచ్చు’ అని ఆనందం వ్యక్తం చేశారు.
₹350కోట్లకు పైనే!

Related tags :