గోరువెచ్చని నీటిలో ఇవి కలిపి తాగితే.. ఇమ్యూనిటీ పెరిగి కరోనా వచ్చే ఛాన్స్ తగ్గుతుందట..
ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయమే.. ఏం చేయాలన్నా… ఏం తినాలన్నాఆ భయమే. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో తెలుసుకోండి..
ఆహారమే అసలైన ఔషధం. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకుంటే చాలు. ఆ ఆహారమే మహా ఔషధమై మనలో అన్ని సమస్యలనీ దూరం చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటే ఎలాంటి సమస్యలు రావు. అందుకే, ముందుగా మనం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి..
గోరు వెచ్చని నీటిలో..
అదే విధంగా, ఇంట్లో తయారు చేసే కొన్ని ఔషధాలు కూడా చక్కగా పనిచేస్తాయి. అందులో ఒకటి ఈ గోరువెచ్చని నీటి మిశ్రమం. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఉదయం ఒకరికి ఓ గ్లాసు చొప్పున నీటిని వేడి చేయండి. అది గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో తేనె, మిరియాల పొడి వేసి తాగండి. చిటికెడు పసుపు కూడా కలుపుకోవచ్చు..
ఎలా పనిచేస్తుందంటే..
మనం ఈ మిశ్రమంలో కలిపే అన్ని పదార్థాల్లోనూ యాంటీ బయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీని వల్ల చాలా వరకూ జలుబు, దగ్గు సమస్యలు దరిచేరవు. జ్వరాలు కూడా దూరం అవుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి సమస్యలు దూరం అవుతాయి. కరోనా వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
ఊపిరితిత్తుల సమస్యలు దూరం..
ఇక కరోనా వల్ల ఎక్కువగా ఊపిరి, శ్వాస సమస్యలు ఉంటాయి. ఈ గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్లేష్మం తగ్గుతుంది. ఆ సమస్యలు దూరం అవుతాయిన చెబుతున్నారు నిపుణులు. కొత్త శ్లేష్మం పెరగడాన్ని కూడా ఈ గోరు వెచ్చని నీటి మిశ్రమం తగ్గిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటేంటే.. ఇందులో వాడే తేనె ఎక్కువ రోజులు నిల్వ ఉండేది అయితే మంచిది.
తేనే, వాము మిశ్రమం..
ఆయాసం, దగ్గు, కఫంతో బాధపడేవారు అరంచెంచా తేనెను వేడి నీటిలో వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజుకి మూడు నుంచి నాలుగుసార్లు చేయాలి. అదేవిధంగా.. అజీర్ణం వల్ల కడుపునొప్పి వస్తే అరకప్పు గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె, 1 చెంచా వేయించిన వాము వేసి తాగండి. ఇలా తాగితే అజీర్ణం, కడుపునొప్పి తాగుతాయి.
వీటితో పాటు..
గోరు వెచ్చని నీటిలో అరచెంచా తేనె వేసుకుని పుక్కిలించండి.. ఇలా చేయడం వల్ల గొంతునొప్పి, చిగుళ్ళ వాపు తగ్గుతుంది. దీంతో పాటు కాఫీ, టీలకు బదులు గ్రీన్ టీలో కొద్దిగా తేనె వేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల మరో లాభం ఏంటంటే.. కొలెస్ట్రాల్ తగ్గి లావు కూడా తగ్గుతారు. వీటితో పాటు.. కరోనా, జ్వరం, జలుబు, దగ్గు, వైరస్‌లు ఇలా ఏ సమస్యలైనా సరే.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే మనపై దాడి చేస్తుంది. అందుకే మనలో ఆ సమస్య లేకుండా ముందుగా జాగ్రత్త పడాలి. అందుకోసం సరైన ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఆహారం తాజాగా వండుకుని ఆ ఆహారాన్నే తీసుకోవడం చేయాలి.