Health

గర్భిణులకు సంగీతం సహకరిస్తుంది

TNILIVE Health || Music Helps Pregnancy Ladies Positively

ఎంత టెన్షన్​లో ఉన్నా మంచి మ్యూజిక్ వింటే చాలా రిలాక్సేషన్​ లభిస్తుంది. ఒత్తిడి క్షణాల్లో మాయమవుతుంది. మరి ప్రెగ్నెన్సీ టైమ్‌‌లో మ్యూజిక్ వినొచ్చా లేదా ? అన్న విషయంలో చాలామందికి డౌట్​ ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్​ అయిన దగ్గర్నించి తల్లి కాబోయే ముందు ప్రతి క్షణం బిడ్డ గురించిన ఆలోచనే ఉంటుంది. పుట్టబోయే వాళ్లకోసం కావాల్సిన ప్రతి ఒక్కటీ ముందుగానే అరేంజ్ చేస్తుంది. వాళ్ల కోసం బట్టలు, బొమ్మలు.. ఇలా ప్రతి ఒక్క విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే డెలివరీ దగ్గరపడుతున్న కొద్దీ ఆమెలో ఆందోళన మొదలవుతుంది. రకరకాల భయాలతో మనసు ప్రశాంతతను కోల్పోతుంది. బిడ్డకడుపులో ఉన్న సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి కూడా మెడిటేషన్​ చాలా మంచిది. అందుకే ఆ సమయంలో ఇష్టమైన పాటలన్నీ ఒక సీడీలో ఉంచుకుని అప్పుడప్పుడు వినొచ్చు. అలాగే. మెడిటేషన్​కి సంబంధించిన మ్యూజిక్ అందులో పెట్టుకోవాలి. ఇంట్లోనే సైలెంట్ ప్లేస్‌‌లో ఇష్టమైన సంగీతాన్ని ప్లే చేసి, హాయిగా బిడ్డ గురించి ఆలోచిస్తే ఒత్తిడి దరిచేరదు. సాధారణంగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇష్టమైన మ్యూజిక్ వింటే చాలు.. అప్పటివరకూ ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఎగిరిపోతుంది. అందుకే, ప్రెగ్నెన్సీ టైమ్‌‌లో కూడా మ్యూజిక్ చాలా మంచిదని వెల్​నెస్​ ట్రైనర్లు చెప్తుంటారు. వీటి వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు కూడా మంచిది. మ్యూజిక్ మంచిదే కానీ, ఇయర్ ఫోన్స్‌‌తో వినకూడదు. మామూలుగానే ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇక ప్రెగ్నెన్సీలో ఆడవారి శరీరం సున్నితంగా మారుతుంటుంది. అందుకే ఎక్కువగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవద్దు. కావాలంటే తక్కువ సౌండ్‌‌తో కొద్దిసేపు వినొచ్చు. ఈ సమయంలో మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే మెలోడీ మ్యూజిక్ మాత్రమే వినాలి. పెద్దగా హడావిడి లేకుండా స్మూత్​గా ఉండి, ఆహ్లాదాన్ని పంచే మ్యూజిక్ మాత్రమే వినాలి. ఓంకారం, ధ్యానం వంటి మ్యూజిక్‌‌ని కూడా వినొచ్చు.