Agriculture

సెకండ్ రౌండ్‌కు అమరావతి పోరు

సెకండ్ రౌండ్‌కు అమరావతి పోరు

రెండో దశ పోరుకు సిద్ధమవుతున్న రైతులు..!!

రాజధాని నగర నిర్మాణానికి 33వేల ఎకరాల భూమి ఇచ్చి చరిత్ర సృష్టించిన అమరావతి రైతులు తమకు న్యాయం చేయాలంటూ చేస్తున్న ఉద్యమం మంగళవారానికి 175 రోజులకు చేరింది.

పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు న్యాయపోరాటం సాగిస్తున్నారు రైతులు.

తొలుత పోలీసులతో ఉద్యమాన్ని అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది.

అయితే హైకోర్టు జోక్యం చేసుకోవడంతో పోలీసులు కొంచెం వెనకడుగు వేసినట్లుగా కనిపిస్తోంది.

కరోనా పేరుతో శిబిరాలు ఖాళీ చేయమని ఆరోగ్యశాఖ నుంచి నోటీసులు ఇప్పించారు.

అది కూడా ఫలించలేదు. 

ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా ‘ఇంటింటా అమరావతి’, ‘అమరావతి వెలుగు’ పేరుతో వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

లాక్‌డౌన్‌ అనంతరం జూలై 1 నుంచి రెండో దశ పోరుకు సిద్ధమవుతున్నట్లు రైతులు చెబుతున్నారు.